శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (22:44 IST)

భారత్‌లో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్‌-2 ప్రారంభోత్సవం

kcrcm
దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌-2 ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మంగళవారం సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభం కానుంది.
 
ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఐటీ కారిడార్‌ రాయదుర్గంలో ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న టీ-హబ్‌ రెండో దశ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భారత్‌లో ఇదే అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌. 
 
హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్‌ 2 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. మూడెకరాల్లో 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. 
 
విశేషాలేంటంటే?
 
ప్రపంచంలో రెండో అతిపెద్దదిగా నిలవనున్న ఈ భవనాన్ని 3.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. టీ హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు. 
 
వీటిలో మొదటిది దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా హోటల్‌ ఐటీసీ కోహినూర్‌ పక్కన నుంచి వచ్చే రోడ్డు, రెండవది. నగరం నలుమూలల నుంచి ఏ మార్గంలో వచ్చినా టీ హబ్‌కు సులభంగా చేరుకునేలా రోడ్డు మార్గాలు ఉన్నాయి.