శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (12:40 IST)

తెలంగాణాలో టెట్ పరీక్షా ఫలితాలు వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం విడుదల కావాల్సిన టెట్ పరీక్షా ఫలితాలను వాయిదా వేశారు. నిజానికి ఈ నెల 12వ తేదీనే ఈ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. కానీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్ మార్చి 24వ తేదీన విడుదల చేయగా, ఆ రోజునే ఈ ఫలితాలను జూన్ 12వ తేదీన వెల్లడిస్తామని ప్రకటించారు. 
 
ఆ రోజున విడుదల చేయకపోగా జూన్ 27వ తేదీకి వాయిదా వేశారు. దీంతో టెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ, సోమవారం కూడా ఈ ఫలితాలను విడుదల చేయలేదు. ఈ ఫలితాల విడుదల తేదీపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ ఫలితాలు ఎపుడు విడుదలవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.