శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (08:40 IST)

నేడు రేపు తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు

Rains
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా నేడు, రేపు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి. మధ్యప్రదేశ్, నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడివుంది. దీనికితోడు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది.
 
వీటిన్నింటి ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. 
 
కాగా, ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నిజాంబాద్‌(రాజన్న జిల్లా)లో 4.6, కోహెడ(సిద్దిపేట)లో 4, మల్యాల(కరీంనగర్‌)లో 4, టేక్మాలు(మెదక్‌)లో 4, అశ్వాపురం(భద్రాద్రి)లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.