దామెర రాకేశ్ సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిపోయిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దామెర రాకేశ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై స్పందించిన సీఎం కేసీఆర్ మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రాకేశ్ సోదరుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వరంగల్ జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం దామెర రాకేశ్ సోదరుడు దామెర రామరాజు అర్హతకు తగిన ఉద్యోగం కల్పించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.