శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కొల్లాపూర్‌లో తెరాస టెన్షన్ ... టెన్షన్

jupalli krishna rao
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార తెరాసలో వర్గపోరు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షన్‌వర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 
 
నియోజకవర్గం అభివృద్ధికి, అవినీతి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే, ఇదే సమయంలో జూపల్లి కృష్ణారావు, పార్టీ మారుతున్నారనే చర్చ కూడా కొనసాగుతోంది. 
 
ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ ఇక, తన వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేశారని.. తాను తుడిచేసుకుని పోయే వ్యక్తిని కాదని.. ఆత్మాభిమానం గల వాడిని అన్నారు జూపల్లి కృష్ణారావు. ప్రస్తుతం తాను టీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. తాను కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను తెరాస పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. 
 
కాగా, జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ దానిపై జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకోవడం చర్చకు దారితీసింది. మరోవైపు, ఇద్దరు నేతలు చర్చకు సిద్ధం అవుతున్నారు. 
 
సవాళ్లు, ప్రతిసవాళ్లతో కొల్లాపూర్‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది. జూపల్లి కొల్లాపూర్‌ వెళ్లడానికి సిద్ధం అవుతుండగా.. మరి ఎమ్మెల్యే వస్తారా? పోలీసుల అనుమతి ఇస్తారా? ముందే ఇద్దరు నేతలను కట్టడి చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.