సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (23:12 IST)

మళ్లీ సమ్మెకు దిగనున్న సింగరేణి కార్మికులు.. ?

సింగరేణి కార్మిక సంఘాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. రీజినల్ లేబర్ కమిషనర్ తో ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల చర్చలు జరిగిన తరుణంలో ఆ చర్చలు ఫలించలేదు.
 
ఈ నెల 21న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి 4 బ్లాకులు ప్రైవేటుకు అమ్ముతాం అని చెప్పడంతో నవంబర్‌లో సమ్మె నోటీస్ ఇచ్చామన్నాయి కార్మిక సంఘాలు.
 
రాష్ట్రంలో ఉన్న నాలుగు బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని యాజమాన్యానికి తేల్చి చెప్పాయి సింగరేణి కార్మిక సంఘాలు. తమ డిమాండ్‌లు పరిష్కారం కాకపోతే మెరుపు సమ్మెకు పిలుపునిస్తామన్నాయి.