ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (17:21 IST)

అద్వానీని మోసం చేసి ప్రధాని అయిన మోదీ.. రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ప్రధాని ప్రసంగం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందన్నారు తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 
 
మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారు.. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ దని చురకలు అంటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997లో కాకినాడలో తీర్మానం చేసింది బిజెపి అని మండిపడ్డారు 
 
మలి ఉద్యమంలో బలి అయిన అమరులకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారు.. ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విభజన కోసం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  
 
తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారు..ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరమని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.