శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (11:03 IST)

సొంత కారు లేదు.. కేసీఆర్ ఆస్తుల విలువ రూ.22.60 కోట్లు

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నట్టుగా ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.22.60 కోట్లు. అప్పులు రూ.8.88 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. ఆయనకు సొంతగా ఒక్క కారు కూడా లేదు. 
 
త్వరలో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఈనెల 14వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తులు.. అప్పులు.. కేసులు.. ఇతర వివరాలతో ప్రమాణపత్రం సమర్పించారు. 
 
సొంతకారు లేదని, కొడుకు కేటీఆర్‌కు రూ.82 లక్షలు, కోడలు శైలిమకు రూ.24.65 లక్షలు అప్పు కింద చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల విలువ రూ.94.59 లక్షలుగా ఉందని, అప్పులు రూ.8.88 కోట్లున్నాయని తెలిపారు.