శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (09:46 IST)

పాన్‌గల్ యువకుడికి జాక్‌పాట్ - రూ.1.20 కోట్ల వార్షిక వేతనం

anish kumar reddy
తెలంగాణా రాష్ట్రంలోని పాన్‌గల్ యువకుడికి జాక్‌పాట్ తగిలింది. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన అనీష్ కుమార్‌కు అమెజాన్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతని వార్షిక వేతనం రూ.1.20 కోట్లు. 
 
అమెరికాలోని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్‌లో అనీష్ కుమార్‌కు ఉద్యోగం లభించింది. పాన్‌గల్ మండలంలోని కేతేపల్లికి చెందిన అనీష్‌ కుమార్‌ రెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. 
 
అనీష్‌ కుమార్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరాడు. గత నెలతో అతడి విద్యాభ్యాసం పూర్తయింది. 
 
తాజాగా, అక్కడ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై టెక్నికల్ విభాగంలో టీం లీడర్ ఉద్యోగానికి ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు వంగూరు బాలీశ్వర్‌రెడ్డి-వసంతలక్ష్మి తెలిపారు.