గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (18:46 IST)

రేపే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ - సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 
 
మెదక్, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయగా, ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఆ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించారు. సీసీ టీవీ కెమెరాలతోపాటు వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదీన చేపడుతారు.