ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులతో కేసీఆర్ భేటీ..
ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మంత్రులతో ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనకు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలను సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకుండానే మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలోనే కేంద్రమే కొనుగోలు చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయంలో తాను కెసిఆర్ లాంటి సీఎ ని చూడలేదని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏ గ్రామం, తండాకు పోయినా నీళ్ళ బాధలే. కానీ ప్రస్తుతం ఇంటింటికీ నల్లాలతో శుద్ధి చేసిన మంచినీళ్ళు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏమి చేశారు? అని సూటిగా బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రశ్నించారు.