శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (08:21 IST)

భార్య కాపురానికి రాలేదని పురుగుల మందుతాగి భర్త...

కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ భర్త... పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నగేపూర్‌లో జరిగింది. 
 
తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నవీపేట మండలంలోని నాగేపూర్‌ గ్రామానికి చెందిన బోయిడి సతీశ్‌(32)కు ఫకిరాబాద్‌కు చెందిన పోసాని అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ క్రమంలో మూడు నెలల క్రితం పోసాని పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ క్రమంలోనే భార్య కాపురానికి రావాలని కుల పెద్దల సమక్షంలో పలుమార్లు కోరారు. అయినప్పటికీ భార్య ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో మనస్తాపం చెందిన సతీశ్‌ ఈ నెల 4న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. మృతుడి తండ్రి నడిపి గంగారాం ఫిర్యాదు మేరకు శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై తెలిపారు.