గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (18:25 IST)

అక్క వరుసయ్యే యువతికి మత్తుమందిచ్చి అత్యాచారం.. ఎక్కడ?

victim
తెలంగాణ రాష్ట్రంలో ఓ యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు తనకు అక్క వరుసయ్యే యువతితో చనువుగా ఉంటూ వచ్చాడు. ఆపై ఆమెను ప్రేమిస్తున్నట్టు వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో ఆ యువతికి చిర్రెత్తుకొచ్చి యువకుడిని మందలించింది. 
 
దీంతో ఆమెపై పగబట్టిన యువకుడు.. ఓ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతిని మాయమాటలతో నమ్మించి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు. అది సేవించిన తర్వాత ఆ యువతి అపస్మారక స్థితిలోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేశాడు. వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత దాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరిస్తూ, ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించసాగాడు. 
 
ఈ క్రమంలో సదరు యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆ వీడియోను అతడు మగ పెళ్లివారికి పంపించడంతో ఆ పెళ్లికూడా రద్దయింది. దాంతో ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న తల్లి తండ్రులు యువతితో కలిసి దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. రాత్రి వేళకేసు నమోదు కావడంతో ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ విషయంపై దమ్మపేట ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌ను వివరణ కోరగా యవతి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.