వివాహితతో రసపట్టులో బస్సు డ్రైవర్, రాడ్డుతో బెడ్ పైన వున్నవాణ్ణి వున్నట్లే చావబాదారు
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. భర్త లేని ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న బస్సు డ్రైవరును ఆమెతో శృంగారంలో మునిగి వుండగానే ఇనుప రాడ్డుతో కొట్టి హతమార్చాడు ఆమె సోదరుడు.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్లలోని పుట్టకోటకు చెందిన ధనమ్మ అనే వివాహిత నివాసం వుంటుంది. ఆమె భర్త 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసాడు. ఆమెకి ఓ కుమారుడు కూడా వున్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తిమ్మినేనిపాలెంకి చెందిన 55 ఏళ్ల వెంకటేశ్వర్లు కారేపల్లి కవిత ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఇతడు రోజూ గార్ల నుంచి ఇంజినీరింగ్ చదివే విద్యార్థులను కళాశాలకు తీసుకుని వెళ్లి తిరిగి సాయంత్రానికి వారిని బస్సులో తీసుకువస్తుంటాడు.
ఈ క్రమంలో అతడు గార్లలోనే బస చేస్తుండేవాడు. అలా అతడికి ధనమ్మతో పరిచయం కలిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాత్రి కాగానే నేరుగా ధనమ్మ ఇంటికి వెళ్లి రాత్రంతా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం ధనమ్మ సోదరుడు, ధనమ్మ అక్క కొడుక్కి తెలిసి రగిలిపోయారు. ఎలాగైనా వెంకటేశ్వర్లును చంపేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాడు ఎప్పటిలాగానే వెంకటేశ్వర్లు ధనమ్మ ఇంటికి వెళ్లాడు.
రాత్రి ఇద్దరూ రసపట్టులో వున్న సమయంలో ధనమ్మ సోదరుడు, అక్కకొడుకు ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్ పైన వున్న వెంకటేశ్వర్లుని ఇనుప రాడ్డుతో పశువుని కొట్టినట్లు కొట్టారు. అతడి తలపైన, ఛాతీపైన తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అడ్డు వచ్చిన ధనమ్మపైన కూడా వారు దాడి చేసారు. వెంకటేశ్వర్లు చనిపోయాడని తెలుసుకున్న ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.