సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 8 జులై 2021 (14:00 IST)

ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి బలవన్మరణం

తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరి వేసి, తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసవ్వడం, కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో రాణి మానసికంగా కుంగిపోయింది.

బుధవారం అర్ధ‌రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. చిన్న కుమార్తె మెడ నుంచి చీర జారిపోవడంతో ఆమె బయటపడింది. తల్లి ఉమారాణి (31)తోపాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి (13), లక్కీ (11) ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్‌లో విషాదం ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.