శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (19:17 IST)

విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ : రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌తోపాటు.. ప్రజా సమస్యలపై ఒక కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించామన్నారు. రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలు పర్యటిస్తాయన్నారు. 
 
విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ రూపొందించామన్నారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ దొంగలుగా మారాయని దుయ్యబట్టారు. 
 
దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలిచ్చి సీఎం కేసీఆర్ కొనాలనుకున్నారని, కానీ, ఓటర్లు తగిన బుద్ధి చెప్పారన్నారు. పైగా, దళిత బంధు పథకాన్ని ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డితో పాటు.. బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.