ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:18 IST)

తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి

Summer
తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వేసవిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉట్నూరు మండలం పులిమడుగులో ఒకరు, కొమురం భీం జిల్లాలో కాగజ్‌నగర్‌లో ఇబ్రహీం అనే చిరు వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బకు ఐదుగురు మరణించారు. 
 
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను మించి నమోదవుతుండటంతో ప్రజలు ఎండదెబ్బకు విలవిలలాడిపోతున్నారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు.