సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:13 IST)

శ్రీకాకుళం జిల్లాలో మూలాపేట పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ

mulapet
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక అయన మూలపేట పోర్టు నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా రూపు రేఖలు మారిపోవడమే కాకుండా సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనుంది. సంతబొమ్మాళి మండలంలోని మూలాపేటలో రూ.4,362 కోట్ల వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. మత్తం 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తుల నిర్మాణం చేపడుతారు. ఈ నిర్మాణ పనులను 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. 
 
ఈ పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విష్ణుచక్రం, మూలాపేటలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.109 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేపడుతారు. బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.176.35 కోట్లత వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.852 కోట్లతో మహేంద్ర తనయ అఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు.