శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (15:32 IST)

వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్ ... ఆరోగ్యంపై వాకబు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ గత కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయనను ఇటీవల టీ పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కూడా వెళ్లి పరామర్శించి వచ్చారు. 
 
ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం వీహెచ్‌కు ఫోన్ చేసిన‌ ఆయ‌న‌ను పరామర్శించారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందిస్తోన్న‌ వైద్యుల సలహాలను పాటించాల‌ని వీహెచ్‌కు చెప్పారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని వెంక‌య్య నాయుడు ఆకాంక్షించారు. 
 
కాగా, వీహెచ్‌ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని అన్నారు. వెంక‌య్య నాయుడి పరామర్శతో తనకు తిరిగి ఉత్సాహం వచ్చిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, కొంత‌ కాలంగా వీహెచ్‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గ‌త ఏడాది ఆయ‌నకు క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్‌ను జ‌యించారు.