ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (09:32 IST)

యోగాతో మానసిక ఒత్తిడి మటుమాయం : ఉపరాష్ట్రపతి వెంకయ్య

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యోగా సాధన వల్ల శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా, ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చన్నారు. 
 
పైగా, యోగాభ్యాసం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చన్నారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల శాంతి, సామరస్యం పెరుగుతాయని తాను నమ్ముతున్నానని చెప్పారు. 
 
ఆయన సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సతీమణి ఉషతో కలిసి యోగా సాధన వేశారు. అంర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనాలు వేశారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు.