ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: కేటీఆర్‌

గురువారం, 5 ఆగస్టు 2021 (09:46 IST)
టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మున్సిపల్‌శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి తప్పకుండా అండగా ఉంటామని అన్నారు.

వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్‌ బీమా సాయం అంఇంచారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించి, వారిలో మనోధైర్యం నింపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ వివిధ ప్రమాదాల్లో మరణించిన పలువురు నాయకులు, కార్యకర్తల కుటుంబాలను కేటీఆర్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గురుకులాల్లో అడ్మిషన్‌లు కావాలని కొందరు, తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని, పెన్షన్‌లు ఇప్పించాలని, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను ఇవ్వాలని పలువురు కోరారు.

వారి సమస్యలన తెలుసుకున్న మంత్రి అందరికీ సహాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. 18 కోట్లకుపైగానే ఇన్సూరెన్స్‌ కడుతున్నామని మంత్రి చెప్పఆరు. 950 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారని తెలిపారు.

ఈ కుటుంబాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ జనరల్‌సెక్రటరీలతో పాటు ఎమ్మెల్యేలపై ఉందన్నారు. వీరందరికీ త్వరలోనే సాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments