బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:46 IST)

టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు.. ఎక్కడో తెలుసా?

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని 60 కుటుంబాలకు చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ  టీడీపీ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో తిమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల్లో 60 కుటుంబాలకు చెందిన మూడు వందల మంది ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ కుమారుడు   ఈడిగ వెంకటేశులు సహకారంతో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

వీరందరినీ ఉమాతో పాటు నియోజకవర్గంలోని ఇతర నాయకులు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వెంకటేశులు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, వైకాపా పార్టీలో కొనసాగానని అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందకపోవడం తో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరుకు విసిగి క్రమశిక్షణ గల పార్టీ అయిన తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.

పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం తో పాటు రాజకీయ పదవులు కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఉమా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తెలుగుయువత నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.