సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (13:41 IST)

మంగళగిరి కొండ చుట్టూ వైసిపి ఎమ్మెల్యే ఆర్కే వాకింగ్

ఈ రోజు ఉదయం 6.30 గంటలకు ఎమ్మెల్యే ఆర్కే గారు టెంపుల్ హిల్ ఎకో పార్క్ వాకింగ్ ట్రాక్ చుట్టూ దాదాపు 6 కిలోమీటర్ల వాకింగ్ మంగళగిరి మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలేంటీర్లు, మంగళగిరి పట్టణ ప్రజలతో కలిసి చేసారు. 
 
ముందుగా పార్వేట మార్గం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి, గారుడాళ్వార్ స్వామి వార్లకు పూజ చేసి ఎమ్మెల్యే ఆర్కే గారు జండా ఊపి వాకింగ్‌ను ప్రాంభించారు.
 
ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఆహ్లాదంగా అందరం కలిసి నడుద్దాం అనే నినాదంతో పట్టణ ప్రజలందరూ మంగళగిరి మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలేంటీర్లు, మంగళగిరి పట్టణ ప్రజలు, YSRCP నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి వాకింగ్ చేశారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారు మాట్లాడుతూ మంగళగిరి మున్సిపల్ సిబ్బంది గాని, పట్టణ ప్రజలు గాని ప్రస్తుత జీవనంలో చాలా పని ఒత్తిల్లో ఉండటం చూస్తున్నాము... ఈ కొండ చుట్టూ వాకింగ్ చేయటం వల్ల ఒక ప్రక్క అధ్యాత్మికంగా, మరొక ప్రక్క మానసికంగా ఆరోగ్యం కోసం ఈ వాకింగ్ చాలా అవసరం అని అన్నారు... అనంతరం ఎమ్మెల్యే ఆర్కే గారు అందరితో కలిసి టిఫిన్ చేశారు..