శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (15:43 IST)

సీన్ రివర్స్.. నగ్నంగా వీడియో తీసి యువకుడిని వేధించిన యువతి

సీన్ రివర్స్ అయ్యింది. మహిళలపై వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్న ఘటనలు చూసే వుంటాం. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమై ఓ యువతి యువకుడిని వేధిస్తున్న సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో యువకుడు సదరు యువతిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో సాక్షి వర్మారెడ్డి అనే యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. ప్రతీ రోజు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునేవారు. 
 
ఆమె నగ్నంగా వీడియోలు చూపించడంతో పాటు నగ్నంగా ఉండాలని యువకుడికి తెలిపింది. వెంటనే అతడు నగ్నంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించింది. దీంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.