Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమని ప్రియుడురాలు ఒత్తిడి.. భార్యకు తెలియడంతో....

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:59 IST)
ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి... మరో యువతి ప్రేమలో పడి పీకల్లోతులో కూరుకునిపోయాడు. అదేసమయంలో పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి ఒత్తిడి చేయసాగింది. పైగా, ఈ విషయం భార్యకూ తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక... బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్‌లో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రెయిన్‌ బజార్‌కు చెందిన దీపక్ కుమార్ (18) అనే యువకుడు హయత్‌ నగర్‌కు చెందిన యువతిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హయత్ నగర్‌లో ఉంటున్న అతడు ఇటీవల మరో యువతి ప్రేమలో నిండా మునిగాడు. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో మనస్పర్థలు చెలరేగాయి. మరోవైపు, పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని పలుమార్లు స్నేహితులకు చెప్పుకుని మథనపడ్డారు. 
 
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి కరణ్‌లాల్ వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. 
 
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments