ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated: శనివారం, 5 జులై 2014 (17:57 IST)

జూలై 25న బెల్లంకొండ శ్రీనివాస్‌-వి.వి.వినాయక్‌ల 'అల్లుడు శీను'

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'అల్లుడు శీను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఇటీవల విడుదలై శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధులు మాట్లాడుతూ... ''ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్‌గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన మరో సూపర్‌హిట్‌ ఆడియో 'అల్లుడు శీను'. ఈ ఆడియో విడుదలైన రోజు నుంచే సేల్స్‌పరంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంత మంచి ఆడియో చేసిన దేవిశ్రీ ప్రసాద్‌గారికి కంగ్రాట్స్‌ చెప్తున్నాము'' అన్నారు. 
 
చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ... ''ఆడియోకు ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంత మంచి ఆడియోను అందించిన దేవిశ్రీప్రసాద్‌కి థాంక్స్‌. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 25న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్లభరణి, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు, వేణు, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, రవిబాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సాహిత్యం: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టంట్‌ శివ, రవివర్మ, వెంకట్‌, డాన్స్‌: రాజసుందరం, ప్రేమ్‌ రక్షిత్‌, గణేష్‌, శేఖర్‌, కథ: కె.యస్‌.రవీంద్రనాథ్‌(బాబీ), కోనవెంకట్‌, డైలాగ్స్‌: కోనవెంకట్‌, సినిమాటోగ్రఫీ: చోటా కె.నాయుడు, కో-డైరెక్టర్స్‌: పుల్లారావు, సురేష్‌, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.