మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (15:00 IST)

అను ఇమ్మాన్యుయేల్.. అర్జున్ రెడ్డితో ఆ రోల్‌కు ఒప్పుకుందా?

మజ్నుతో యువతను ఆకట్టుకున్న అను ఇమ్మాన్యుయేల్‌కు హిట్స్ లేకపోయినా ఛాన్సులు వరిస్తున్నాయి. తెలుగు తెరకు అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ సరసన, అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో కథానాయికగ

మజ్నుతో యువతను ఆకట్టుకున్న అను ఇమ్మాన్యుయేల్‌కు హిట్స్ లేకపోయినా ఛాన్సులు వరిస్తున్నాయి.  తెలుగు తెరకు అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ సరసన, అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో కథానాయికగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తుంది. ఈ నేపథ్యంలో గెస్ట్ రోల్‌లో కనిపించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ గెస్టు రోల్‌కి క్రేజున్న అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకుంటేనే బాగుంటుందని దర్శకుడు భావించాడు. ఇందుకోసం ఆమెను సంప్రదించడం కూడా జరిగింది. ఇందుకు ఆమె ఓకే అని చెప్పేసిందట. 
 
గీతాఆర్ట్స్ బ్యానర్‌కు గల పేరును దృష్టిలో పెట్టుకుని.. ఇంకా అర్జున్ రెడ్డికి యూత్‌లో వున్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకే అను ఇమ్మాన్యుయేల్‌ గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.