1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 మే 2025 (16:53 IST)

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

trisha - simbu
ప్రముఖ హీరోయిన్, చెన్నై చంద్రం త్రిషకు పెళ్లయిపోయిందట. కోలీవుడ్ యువ హీరోనే ఆమె భర్త అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న త్రిష వయసు నాలుగు పదులు దాటిపోయింది. అయితే, ఆమె గురించి మాత్రం ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది. 
 
గతంలో తోటి నటుడు విజయ్‌‍తో ఆమె ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ డేటింగ్‌ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా తమిళ యువ హీరో సింబుతో కలిసి ఏకంగా ఏడు అడుగులు వేసినట్టు ప్రచారం ఊపందుకుంది. ఇటీవల త్రిష, సింబులు చాలా సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 
 
ఈ ఫోటోలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతా కనిపించారు. ఈ ఫోటో బయటకు రావడంతో వారిద్దరూ మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో త్రిష, సింబు పెళ్లివార్త మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వైరల్ అవుతున్న ఫోటో ఇటీవల చెన్నై నగరంలో జరిగిన "థగ్‌లైఫ్" విలేకరుల సమావేశంలోనిది. 
 
మణిరత్నం - కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 5వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సింబు కూడా నటించారు. ఈ విలేకరుల సమావేశంలో త్రిష, సింబులు పక్కపక్కనే కూర్చొని ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటూ కనిపించారు. ఈ ఫోటోను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో వారిద్దరికీ పెళ్లయిపోయినట్టుగ పుకార్లు ప్రచారం చేస్తున్నారు.