గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (10:41 IST)

అవంతికకు డీజే స్నేక్ ఛాలెంజ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన తెల్లపిల్ల?

బాహుబలి అవంతికకు అవకాశాలు ఆశించినంతగా రావట్లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తమన్నా కథానాయికగా 'నా నువ్వే' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంపై అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్యారిస్‌కు చెందిన

బాహుబలి అవంతికకు అవకాశాలు ఆశించినంతగా రావట్లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తమన్నా కథానాయికగా 'నా నువ్వే' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంపై అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్యారిస్‌కు చెందిన ప్రముఖ డీజే స్నేక్ విసిరిన ఛాలెంజ్‌లో తమన్నా నెగ్గి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. 
 
మెజెంటా రిడ్డిమ్ పాటకు తాను చేసిన డ్యాన్స్‌ను చేయాలంటూ తమన్నాకు స్నేక్ ఛాలెంజ్ విసిరాడు. ఈ సవాల్‌లో తాను నెగ్గినట్టు తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా జూయీ వైద్య వ్యవహరించాడని తమన్నా చెప్పింది. అంతేగాకుండా తన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. డీజే స్నేక్ ఈ వీడియో చూసి షాకవుతారని కూడా మెసేజ్ పెట్టింది.
 
తమన్నా పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, డీజే స్నేక్, తమన్నా లిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. గతంలో బాహుబలి సినిమాను డీజే స్నేక్‌కు తమన్నా చూపెట్టింది.