శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (14:34 IST)

చిట్టి రోబోగా తమన్నా.. రజనీ సార్‌కి ఇదో ట్రిబ్యూట్..

బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ''లిప్ సింగ్ బ్యాటిల్'' అనే కార్యక్రమం కోసం మిల్కీ బ్యూటీ తమన్నా చిట్టి రోబో గెటప్‌లో అదరగొట్టింది. ఈ ప్రోగ్రామ్ కోసం క్రికెటర్ ఇ

బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ''లిప్ సింగ్ బ్యాటిల్'' అనే కార్యక్రమం కోసం మిల్కీ బ్యూటీ తమన్నా చిట్టి రోబో గెటప్‌లో అదరగొట్టింది. ఈ ప్రోగ్రామ్ కోసం క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఓ ఇంగ్లిష్ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే ''లిప్ సింక్ బ్యాటిల్'' కార్య‌క్ర‌మం ఆధారంగా ఈ షోను రూపొందించారు. 
 
ఈ షోలో తమన్నా అదరగొట్టింది. రోబో గెటప్‌లో ఉన్న ఫొటోను తమన్నా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్‌కి ఇది తన ట్రిబ్యూట్‌ అని తమన్నా తెలిపింది. తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నటించలేదని వెల్లడించింది. ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది. 
 
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ కార్యక్రమంలో ఆడిపాడింది. ఇప్ప‌టికే శిల్పా శెట్టి, ర‌వీనా టాండ‌న్‌, షారుక్ ఖాన్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి బాలీవుడ్ తార‌లు పాల్గొన్నారు.