శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (23:01 IST)

అలాంటి ప్రేమలు శాశ్వతం... నా ప్రేమను పొందాలంటే ఆ లక్షణాలు ఉండాలి: మిల్కీ బ్యూటీ

ఈ కాలంలో యువతీయువకుల మధ్య పుట్టే ప్రేమలు నిజమైనవి కావని టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా అంటోంది. ముఖ్యంగా, హోదాను చూసి పుట్టే ప్రేమతో పోలిస్తే, గౌరవం నుంచి పుట్టే ప్రేమ శాశ్వతమని, యువతీ యువకుల మధ్య అవగాహ

ఈ కాలంలో యువతీయువకుల మధ్య పుట్టే ప్రేమలు నిజమైనవి కావని టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా అంటోంది. ముఖ్యంగా, హోదాను చూసి పుట్టే ప్రేమతో పోలిస్తే, గౌరవం నుంచి పుట్టే ప్రేమ శాశ్వతమని, యువతీ యువకుల మధ్య అవగాహన కూడా చాలా ముఖ్యమైనదని ఈ భామ చెపుతోంది.
 
ప్రేమ గురించి తమన్నా మాట్లాడుతూ... ఈతరం అమ్మాయిలు చాలా మారిపోయారని, ప్రేమ విషయంలో త్వరగా ఓ అభిప్రాయానికి రావడం లేదని, వారికి ప్రేమకు, వ్యామోహానికి ఉన్న తేడా తెలిసిపోతోందని చెబుతోంది. 
 
హోదాను చూసి పుట్టే ప్రేమతో పోలిస్తే, గౌరవం నుంచి పుట్టే ప్రేమ శాశ్వతమని, యువతీ యువకుల మధ్య అవగాహన కూడా చాలా ముఖ్యమైనదని అంటోంది. 
 
పైగా, తన ప్రేమను పొందాలంటే ఈ లక్షణాలుంటే చాలని, ఇంతకుమించి మరేమీ అక్కర్లేదని తన మనసులో మాట చెప్పింది తమన్నా. "జై ల‌వ‌ కుశ" చిత్రంలో ఐటెం సాంగ్‌తో అల‌రించిన త‌మ్మూ ప్ర‌స్తుతం ప‌లు కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.