బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 15 మే 2018 (21:10 IST)

మ‌ళ్లీ ఆ హీరోయిన్‌కే బాల‌య్య ఛాన్స్

నంద‌మూరి న‌టసింహం బాలకృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ చేసేందుకు రెడీ అవుతూనే మ‌రోవైపు డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాని ఈ

నంద‌మూరి న‌టసింహం బాలకృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ చేసేందుకు రెడీ అవుతూనే మ‌రోవైపు డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాని ఈ నెల 27న ప్రారంభించ‌నున్నారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చే అంశాలతో కథను రెడీ చేయడంలో వినాయక్ సిద్ధహస్తుడు. 
 
ఇక వినాయ‌క్‌కి బాల‌య్య జ‌త క‌లిస్తే... ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రంలో న‌టించేందుకు మ‌ళ్లీ శ్రియ‌కే ఛాన్స్ ఇచ్చాడ‌ట బాల‌య్య‌. గతంలో బాలకృష్ణ సరసన శ్రియ 'చెన్నకేశవరెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. ' పైసా వసూల్' చిత్రాల్లో నటించింది. నాలుగోసారి ఆమె ఈ సినిమాలో బాలకృష్ణతో జోడీ కడుతోంది. 
 
వివాహమైన తరువాత శ్రియ చేస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఖైదీ నెం 150 త‌ర్వాత వినాయ‌క్ తెర‌కెక్కించిన ఇంటిలిజెంట్ ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో వినాయ‌క్ ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. మ‌రి.. బాల‌య్యను కొత్త‌గా వినాయ‌క్ ఎలా చూపించ‌నున్నారో?