ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (11:40 IST)

సలార్‌లో సిమ్రత్ కౌర్.. స్టెప్పులు ఇరగదీస్తుందట..!

Simrat Kaur
Simrat Kaur
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తోంది. ఇందులో గబ్బర్ సింగ్ ఫేమ్ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్‌లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, టిన్ను ఆనంద్, జగపతిబాబు, రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ కోసం సిమ్రత్ కౌర్ ఎంపిక చేయబడిందని టాక్. ఆమె ప్రత్యేక పాట కోసం ఆమె స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. 
 
సిమ్రత్ కౌర్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యి తన పార్ట్ షూట్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.