'బిగ్ బాస్-4'లోకి గుండెల్లో రైళ్లుపరుగెత్తించే గంగవ్వ
ప్రముఖ టీవీ చానెల్‌లో బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా ఒకటి లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తాజాగా యూట్యూబ్ ప్రేక్షకులకి బాగా సుపరిచితురాలైన గంగవ్వ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈమె త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందట.
తెలంగాణ యాసతో చుట్టు పక్కన వాళ్ళ గుండెళ్లో రైళ్ళు పరిగెత్తించే గంగవ్వ.. ఇంటి సభ్యులతో ఫుల్ కామెడీ చేస్తుందని భావించిన నిర్వాహకులు ఆమెని ఎంపిక చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతుంది.
కానీ గత మూడు సీజన్‌లు చూస్తే ఇంత వయస్సు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరిని ఎంపిక చేయలేదు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు
కాగా మంచి పాపులారిటీ ఉన్న గంగవ్వ గతంలో పలు చిత్రాల్లో కూడా నటించింది. సమంత, విజయ్ దేవరకొండ, కాజల్ వంటి స్టార్స్‌తో ముచ్చటించింది. అనేక మంది ప్రశంసలు కూడా పొందింది. అయితే తాజా సమాచారం ప్రకారం గంగవ్వకు బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చిందనే వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.