సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (10:17 IST)

త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్న హన్సిక!

Hansika
దేశముదురు హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి కూతురు కానుంది. తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్‌ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఆమెకు కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. 
 
ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతి త్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.