శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 21 జులై 2021 (22:18 IST)

ఆ పని రామ్ ఒక్కడే చేయగలడంటున్న నిధి అగర్వాల్

దర్సకుడు పూరిజగన్నాథ్‌కు సరైన హిట్లు లేక సతమతమవుతున్న తరుణంలో భారీ విజయాన్ని తెచ్చిపెట్టిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరీ కంబాక్ మూవీ ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
 
ఇక హీరో రామ్ కెరీర్లో ఈ సినిమా పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాలో నటించిన అందాల భామలు నిధి అగర్వాల్, నబా నటాషా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. తమ గ్లామర్‌తో ఈ ఇద్దరు హీరోయిన్లు కుర్రకారును ఫిదా చేశారు.
 
ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
ఇస్మార్ట్ శంకర్ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని నిధి చెప్పారు. అయితే ఈ సినిమా రీమేక్ చేస్తే రామ్‌నే హీరోగా తీసుకోవాలంటోంది నిధి. రామ్ తప్ప మరెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరని ఆమె అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇస్మార్ట్ శంకర్ రీమేక్ కోసం ఎవరూ ప్రయత్నం చేయకుండా రామ్‌నే హీరోగా తీసుకోవాలని తేల్చిచెప్పారు.
 
తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ హిందీలోను బంపర్ హిట్ అవుతుందని నిధి భావిస్తున్నారు. మరి ఈ అందాల భామ చెప్పినట్లుగా మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారో లేదో అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత నిధి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా ఈ బ్యూటీ పవన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. క్రిష్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి నటిస్తున్నారు.