సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (14:31 IST)

నటి ప్రగతి పారితోషికం ఎంతో తెలుసా?

Pragathi
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రగతి ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతీ సినిమాలో హీరో, హీరోయిన్ కు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్టుకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. 
 
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు. అంతేకాదు సినిమల్లో హీరోలకు అమ్మగా.. అత్తగా.. వదినగా.. నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ప్రగతి. వీరికి చాలా మంది మహిళా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 
 
ప్రగతి ఒక్కరోజు కాల్షీట్ కోసం దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే ఇది అన్ని సినిమాలకు ఒకేలా ఉండక పోవచ్చు. పెద్ద సినిమాలకు ఓ రకంగా.. చిన్న సినిమాలకు ఓ రకంగా ఉంటుంది. అంతేకాదు పాత్ర ఇంపార్టెన్స్‌ను బట్టి కూడా మారోచ్చునని తెలుస్తోంది.