గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (10:57 IST)

సోనియా అగర్వాల్‌తో ఎస్పీచరణ్ పెళ్లి?

Sonia Agarwal
Sonia Agarwal
సోనియా అగర్వాల్ అంటేనే 7జీ బృందావనం కాలనీ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా వుంటూ.. సీరియల్స్‌లో అప్పుడప్పుడూ మెరుస్తోంది. తొలిసారిగా ఈమె 2002 సంవత్సరంలో నీ ప్రేమకై అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. 
 
కానీ 7/G బృందావన కాలనీ సినిమా ద్వారా పాపులర్ అయింది. ఈ హీరోయిన్ అనేక కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే 7/G బృందావన కాలనీ సినిమాకు దర్శకత్వం వహించిన సెల్వరాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2009లో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత మరో వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవనాన్ని గడుపుతోంది సోనియా అగర్వాల్. అయితే తాజాగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడితో సోనీయా అగర్వాల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
 
చరణ్‌తో ఆమె పెళ్లి త్వరలో జరుగనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరణ్ విషయానికి వస్తే సింగర్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. 
 
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కేవలం సింగర్ గానే కాకుండా, నటుడిగా పలు సినిమాల్లో చేసి, అలాగే దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించాడు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడు ఎస్పీ చరణ్.  
 
ప్రస్తుతం పాడుతా తీయగా అనే సింగింగ్ షో లో జడ్జి గా పాల్గొంటున్నారు. అయితే ఈయన త్వరలోనే ఓ వెబ్ సిరీస్ చేయనున్నారని సమాచారం. ఆ వెబ్ సిరీస్‌లో సోనియా అగర్వాల్  కీలక పాత్రలో కనిపిస్తుందనే సమాచారాన్ని ఎస్పీ చరణ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ వీరిని కనెక్ట్ చేసిందని.. త్వరలో వీరిద్దరి వివాహం జరుగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది.