1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?
కల్కి 2898 AD గురువారం రిలీజ్ అయ్యింది. రిలీజైన ఒక రోజే భారీ కలెక్షన్లను సాధించింది. ఇంకా ఈ సినిమాలో నటీనటులపై సినీ ఫ్యాన్స్, విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం అదిరిందని టాక్ వచ్చేసింది. ఇక ఈ సినిమా హీరోయిన్ దీపికా పదుకునే తన ఖాతాలో కొత్త రికార్డును కైవసం చేసుకోనుంది.
ఈ సినిమాలో దీపికా పదుకొణె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమెకు కొత్త రికార్డు కూడా సొంతం కానుంది. పఠాన్, జవాన్ భారీ విజయాన్ని సాధించి, గత ఏడాది 1000-కోట్ల మార్కును దాటిన తర్వాత, ఆమె తాజా చిత్రం కల్కి 2898 AD మళ్లీ ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాలనుకుంటోంది.
కల్కి 2898 AD ఈ మైలురాయిని సాధిస్తే, దీపిక మూడు సినిమాలతో రూ.1000కోట్ల చిత్రాలలో నటించిన నటిగా గుర్తింపు సంపాదించుకుంటుంది. దీంతో రాబోయే సంవత్సరాల్లో బీట్ చేయడం కష్టతరమైన రికార్డును నెలకొల్పుతుంది. కల్కి 2898 AD మొదటి వారాంతం నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.