సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (15:40 IST)

శ్రీజ-కళ్యాణ్ దేవ్‌లు మళ్లీ కలుస్తారా?

Sreeja Konidala, Ram Charan
మెగా తనయ శ్రీజ-కళ్యాణ్ దేవ్‌లు మళ్లీ కలవనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీజా మొదటి భర్త కూతురుతో కూడా కళ్యాణ్ దేవ్ ఎంతో మంచి సాన్నిహిత్యంని మైంటైన్ చేస్తున్నాడు.
 
ఈమెని కూడా రీసెంట్ సమయంలో ఎన్నో సార్లు కలిసిన సందర్భాలున్నాయి. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్‌గా ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, వీళ్లిద్దరు విడాకులు రద్దు చేసుకొని మళ్ళీ ఒకటి కాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
 
ఈ మధ్య శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు పరోక్షంగా పెడుతున్న కొన్ని కొటేషన్స్‌ని చూస్తుంటే ఇది అర్థం అవుతుంది. ఇదే నిజమైతే మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.