మెగాస్టార్ చిరంజీవి, డా. రాజశేఖర్ మధ్య మళ్ళీ కుంపటి రాజుకుందా
మెగాస్టార్ చిరంజీవికి యాంగ్రీ హీరో డా. రాజశేఖర్ కు మధ్య చాలా గొడవలు జరిగాయి. దానికి అభిమానులు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అదంతా గతం. కానీ ఇలా ఎన్నిరోజులు వుంటాయి గొడవలు. ఎప్పుడో ఒకప్పుడు సద్దుమణుతాయి. అలానే మా రెండు కుటుంబాల్లో గొడవలు సద్ధు మణిగాయని డా. రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ తెలియజేసింది. ఆమె కోటబొమ్మాళి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఈ సందర్భంగా చిరంజీవి విషయంలో ఆమె బాగా స్పందించింది.
పొలిటిక్స్ అంటే డిపరెంట్ అభిప్రాయాలు వుంటాయి. మా ఫ్యామిలీలో లాంగ్ బ్యాక్ గొడవలు జరిగాయి. ఇరువురి మధ్య మాటలు కూడా హైలైట్ అయ్యాయి. అదంతా నెగెటివ్ పిరిడ్. కాలం మారింది. మేము తీసిన గడ్డెం గ్యాంగ్ సినిమాలో నాగబాబు గారు నటించారు. మేమంతా ఒకే గొడుగు. ఇండస్ట్రీ కింద వున్నాం. అవసరమైతే అందరం కలుస్తాం. ఇది లైఫ్ లో ఓ భాగం. ఆ ఇష్యూను చాలా మంది బయట వారు టైంపాస్ కోసమో ఏమో కానీ స్పెడ్ చేస్తున్నారు. అసలు వారి కెందుకు అంత ఆసక్తో నాకు అర్థంకాలేదు. అభిమానం వుండొచ్చు. కానీ చిరంజీవి కుటుంబపై మాకు వున్నంత అభిమానం ఎవరికీ లేదు. ఏ దైనా ఇష్యూ జరిగితే అందులో మంచి గురించి మాట్లాడండి. ఎందుకు బయటవారు అలా బిహేవ్ చేస్తారో అర్థంకావంలేదు అని అన్నారు.
ఆ మధ్య మా ఎన్నికల్లో చిరంజీవి నిర్ణయం పై రాజశేఖర్ ఘాటుగా కౌంటర్ వేశారు కూడా ఇక ఇప్పుడు చిరంజీవి, రాజశేఖర్ కుటుంబాల మధ్య సత్ సంబంధాలకు నిదర్శనంగా మారాయి. . ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో శివానీ రాజశేఖర్ నటించింది. ఈనెల 24 న ఆ సినిమా విడుదల కాబోతుంది.