నటుడు చంద్రమోహన్ అంతిమయాత్ర నేడే..
సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ మరణ వార్తవిని టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి.
చంద్రమోహన్ నివాసం నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. దాదాపు 980 సినిమాల వరకు నటించి మెప్పించారు చంద్రమోహన్. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్.