మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (13:16 IST)

అది దాచుకోవడం నా వల్ల కాదు.. కీర్తి సురేష్

మహానటి సినిమాతో తానేంటో నిరూపించుకుంది కీర్తి సురేష్. అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో కీర్తి సురేష్ వందకు వందశాతం న్యాయం చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అది నిజం. ఆ సినిమా తరువాత కీర్తికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ అన్నింటిని కీర్తి సురేష్ ఒప్పుకోలేదు. మెల్లమెల్లగానే మంచి కథలను ఎంచుకుని ముందుకు సాగుతోంది.
 
అయితే ఈమధ్య కీర్తి ట్విట్టర్ వేదికగా చేసిన సందేశం అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. మేము కళాకారులం. కళాకారులంటే అన్ని విధాలుగా నటించాల్సి ఉంది. భావోద్వేగాలను అస్సలు ఆపుకోలేం. భావోద్వేగాలతో కూడి సన్నివేశం వస్తే అది నటించిన కొద్ది సేపు తరువాత కూడా అందులోనే లీనమైపోతాం. దాన్ని దాచుకోవడం చాలా కష్టం. అలాగే నవ్వుతో కూడిన సన్నివేశాలైనా అంటోంది కీర్తి సురేష్.
 
ఇక సినిమాల కన్నా నా పెళ్ళి గురించే ఎక్కువగా తమిళ సినీపరిశ్రమలో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను. నా పెళ్ళికి అంత తొందరేమీ లేదంటోంది కీర్తి సురేష్. ఇంకా ఎన్నో సాధించాల్సి ఉంది.. కాబట్టి అవన్నీ పూర్తయిన తరువాతనే ఇది జరుగుతుంది అంటోంది కీర్తి సురేష్.