Daily Horoscope
✕

చెర్రీ - శంకర్ మూవీపై లేటెస్ట్ అబ్‌డేట్స్

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 12 మార్చి 2021 (12:26 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ టాలీవుడ్ ఏసీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చనున్నారనే వార్త గురువారం ఒకటి వెలువడింది. ఇపుడు మరో వార్త వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఈమె గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. చరణ్‌తో ఆమె జోడీ బాగుందంటూ అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది.
 
నిజానికి దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఆమె స్థానంలో తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా కోసం  ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

అన్నీ చూడండి

పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారంపై నోరెత్తను.. అది ఆయన పర్సనల్: అంబటి రాంబాబు

శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఆలోకమయ్ కోల్‌కతా

వివాహేతర సంబంధం.. డబ్బులు అడుగుతుందని చంపేసిన ప్రియుడు

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్సనల్ విషయాలపై నో కామెంట్.. టీడీపీ, వైకాపా సైలెంట్

అన్నీ చూడండి

ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

తర్వాతి కథనం
Show comments