బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:53 IST)

విశ్వంభర షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి కాలికి గాయం!

Megastar Chiranjeevi dance
Megastar Chiranjeevi dance
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నూతన చిత్రం విశ్వంభర. వశిష్ట్ దర్శకుడు. యువి క్రియేషన్స్ బేనర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే నాయిక త్రిష సెట్లో ఎంట్రీకి ఆహ్వానం పలుకుతూ చిరంజీవి, చిత్ర టీమ్ బొకెను ఇచ్చారు. మొదట అన్నపూర్ణ స్టూడియోలో కొంత షూట్ చేశారు. 
 
విశ్వసనీయ సమాచారం మేరకు, రెండు రోజులుగా శంకరపల్లిలోని గుంటూరు కారం  సినిమా సెట్లో విశ్వసంభర షూట్ జరుగుతోంది. ఇందులో నటి సురభి మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. పెండ్లి జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈరోజు చిరంజీవి షూట్ కు విశ్రాంతి ఇచ్చారని తెలిసింది. గతంలోనే మోకాలు నొప్పికి ఆయన గురయ్యారు.  తాజాగా రెండు రోజులుగా డాన్స్ వేయడంతో కొరియోగ్రాఫర్లు, డాక్టర్ల సూచన మేరకు ఈరోజు రెస్ట్ తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో తమన్నాకూడా ఓ పాత్ర పోషిస్తోంది. ఆమెది ఐటెం సాంగా, క్యారెక్టరా తెలియాల్సి వుంది.