శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:03 IST)

ఒకే లొకేషన్‌లో నాగచైతన్య, శోభితా.. కలిసే వెళ్లారా?

Nagachaitanya_Shobitha
టాలీవుడ్ హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్, అలాగే మాజీ మిస్ ఇండియా సైరన్ శోభితా ధూళిపాళ ఒకే లొకేషన్‌లో వున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
ఈ ఇద్దరు నటులు ఇటీవల వారి సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఒకే స్థలంలో తీసిన చిత్రాలను అప్‌లోడ్ చేశారు. ఇంతకుముందు వారు లండన్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా శోభిత మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంకి వెళ్లి వెకేషన్‌ను సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఆపై మరో రోజు తర్వాత నాగ చైతన్య తన వెకేషన్ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. 
 
ఈ ఫోటోలు ఒకే లొకేషన్‌కు చెందినవి అని నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరైతే.. వేసవి వెకేషన్ కోసం చాలామంది చాలామంది వెళ్తుంటారని.. అలా వారిద్దరూ వెళ్లి వుండవచ్చునని చెప్తున్నారు.