ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 4 జులై 2024 (11:44 IST)

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

Devara release poster
Devara release poster
ఎన్.టి.ఆర్. జూనియర్ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకుడు. ఎన్.టి.ఆర్. కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమాగా రూపొందుతోంది .సముద్ర దొంగల నేపథ్యంలో ఈ చిత్రం వుంటుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమా ఫీవర్ జరుగుతుండగా.. అలాంటి ఫీల్ ను దేవర చూపించనున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
కాగా, ఈనెల 15వ తేదీన చిత్రంలోని రెండవ పాట విడుదల కాబోతోంది.  30వ తేదీన సినిమాకి సంబంధించిన ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సినిమాను సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
 
ఇటీవలే భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ గోవా అడవుల్లో ఆసక్తికరమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. రత్నవేలు కెమెరా నైపుణ్యంతో అద్భుతంగా చిత్రీకరించారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా సన్నివేశాలకు సహకరించిన  సైఫ్ అలీ ఖాన్,  కెమెరా సిబ్బందికి, లైట్ సిబ్బందికి, స్టంట్ సిబ్బందికి, దేవర  టీమ్‌కి ధన్యవాదాలు తెలియజేసింది చిత్ర నిర్మాణ సంస్థ.  సెప్టెంబర్  7 న ట్రైలర్ ను విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనంతరం ముంబైలో గ్రాండ్ గా ఫంక్షన్ చేయనున్నారు.
 
సినిమా విడుదలయ్యేదాకా సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేయాలని మూవీ యూనిట్ ఫిక్సయింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన డేట్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.