సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (16:50 IST)

కల్కి లో అర్జునుడి క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ

Arjuna in Kalki
Arjuna in Kalki
రెబెల్ స్టార్ కల్కి సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ఈ సినిమాలో అనేక గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటిలో హైలైట్ అవుతోంది విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్ర. ఈ క్యారెక్టర్ లో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారు.
 
అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్ గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్ ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్ లోనూ ఓ స్పెషల్ మూవీ అనుకోవచ్చు.