గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (21:09 IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌తో రష్మిక రొమాన్స్..

rrrmovie
"ఆర్ఆర్ఆర్‌"తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. కొరటాలతో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాది సమ్మర్‌లోనే ప్రకటించగా.. ఈ సమ్మర్‌లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. 
 
ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు.
 
ఇక ఈ మూవీలో మొదట అలియా భట్‌ను తీసుకోగా.. ఆమె పలు కారణాల వల్ల తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. 
 
కానీ తాజా సమాచారం ప్రకారం.. "ఎన్టీఆర్ 30"లో యంగ్ టైగర్‌తో రష్మిక రొమాన్స్ చేయబోతోందట. అలియా స్థానంలో మేకర్స్ రష్మికను తీసుకున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.