బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (14:46 IST)

శ్రద్ధా కపూర్‌కు కూడా త్వరలోనే డుం డుం డుం..?

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. శక్తి కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.  పలు హిట్‌ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌కు సాహో ద్వారా పరిచయం అయ్యింది. 
 
అయితే తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో శ్రద్ధాదాస్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో జంటగా హాజరవ్వడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. 
 
కాగా శ్రద్ధా కపూర్ వివాహాంపై అలనాటి నటి, ఆమె మేనత్త పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్‌ చేసుకుంది. దీనికి స్పందించిన పద్మిని " నీ పెళ్లిలో కూడా ఈ పాటనే పాడుతాను" అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకొబోతుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.